ఆసియా క్రీడల సదస్సులో పాల్గొన్న బహ్రెయిన్ అధికారులు
- June 30, 2023
బహ్రెయిన్: చైనాలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరగనున్న రాబోయే ఏషియాడ్ కోసం నిర్వహించిన సమావేశంలో హాంగ్జౌ ఆసియా క్రీడలకు బహ్రెయిన్ చెఫ్ డి మిషన్, అహ్మద్ అబ్దుల్‌గఫార్ పాల్గొన్నారు. వీరితో పాటు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ఫోటోగ్రాఫర్ అలీ అల్ హల్వాచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతినిధుల రాక, హోటళ్లు, అథ్లెట్లు , మీడియా విలేజ్, పోషణ, రవాణా, స్టేడియంలు, ఇతర క్రీడా సౌకర్యాలు, ప్రారంభ - ముగింపు వేడుకలు మొదలైన వాటితో సహా ఆటల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. క్రీడల సందర్భంగా ఈవెంట్లు మొత్తం 54 ప్రాంతాలలో నిర్వహించబడతాయి. మరో 31 శిక్షణ కోసం కేటాయించబడ్డాయి. అథ్లెట్లను రవాణా చేయడానికి డ్రైవర్లు లేకుండా స్మార్ట్ కార్లను వినియోగించనున్నారు. ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 12,000 మంది మీడియా నిపుణులు ఈ క్రీడలను కవర్ చేస్తారని కూడా ప్రకటించారు. కాన్ఫరెన్స్ తర్వాత వివిధ క్రీడా సౌకర్యాలు, స్టేడియంలలో ఫీల్డ్ టూర్ నిర్వహించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







