శర్వానంద్‌,లావణ్య త్రిపాఠి కాంబినేషన్ తో 'జోడీ కుదిరింది' చిత్రం

- May 13, 2016 , by Maagulf
శర్వానంద్‌,లావణ్య త్రిపాఠి కాంబినేషన్ తో 'జోడీ కుదిరింది' చిత్రం

రన్‌రాజారన్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా చిత్రాలతో ఆకట్టుకొన్నాడు శర్వానంద్‌. భలేభలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో విజయాలు అందుకొంది లావణ్య త్రిపాఠి. ఇప్పుడు వీళ్లిద్దరికీ జోడీ కుదిరింది. శర్వానంద్‌ కథానాయకుడిగా బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చంద్రమోహన్‌ దర్శకుడు. కథానాయికగా లావణ్యని ఎంచుకొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కించిన 'డార్లింగ్‌' చిత్రానికి సహాయకుడిగా పచేసిన చంద్రమోహన్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. అతన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జూన్‌ 1 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. రతన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, సమర్పణ: భోగవల్లి బాపినీడు. కాంబినేషన్ తో 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com