సైబర్ క్రైమ్‌తో తస్మాత్ జాగ్రత్త
- May 13, 2016
దుబాయ్ విమెన్స్ అసోసియేషన్ సహకారంతో దుబాయ్ పోలీస్, ఎటిసలాట్‌తో అల్ అమీన్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో 'పెరుగుతున్న బ్లాక్‌మెయిలింగ్' కేసుల పట్ల పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్స్, బ్లాక్‌మెయిలింగ్ కేసులు, అలాగే యూఏఈ చట్టాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చ జరిగింది. మహిళలు, పిల్లలు సోషల్ మీడియా కారణంగా బాధితులవుతున్నారనీ, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం లేదా ఫొటోలను పంపించడం ప్రమాదకరమని ఇంజనీర్ అబ్దుల్ అజీజ్ అల్ జరౌని చెప్పారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో ఉండే వెబ్సైట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 2013లో అల్ అమీన్ 80 బ్లాక్మెయిల్ కేసులను ఎదుర్కొందని, 2012లో వీటి సంఖ్య 212గా ఉందని, ఓ వ్యక్తి 60 మంది పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి, వారికి చెందిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అందులో చాలామంది పిల్లలు ఆత్మహత్యాత్నం చేశారని ఖలీల్ అల్ అలి చెప్పారు. ఈ సంఘటన వేరే దేశంలో జరిగింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







