పారిస్‌లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ
- July 02, 2023
యూఏఈ: అల్లర్లు నేపథ్యంలో పారిస్‌లోని ఎమిరాటీలు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ మేరకు పారిస్‌లోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది. ఫ్రెంచ్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను అనుసరించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు 0097180024 లేదా 0097180044444లలో సంప్రదించాలని కోరింది. మరోవైపు మార్సెయిల్, లియోన్, టౌలౌస్, స్ట్రాస్‌బర్గ్, లిల్లే వంటి నగరాలతో సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు భవనాలు, వాహనాలు తగులబెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. పారిస్‌లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







