అబు ధాబిలో రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

- May 14, 2016 , by Maagulf
అబు ధాబిలో రోడ్డు దాటుతూ  ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

అల్ ఐన్  జాతీయ రహదారి మీద  అల్ ఖజ్న ప్రాంతంలో రోడ్డు దాటే సమయంలో ఇద్దరు వ్యక్తులు దర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రీతం  సలమాబాద్  ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరణించిన భారతీయ వ్యక్తి  శిబు, ( 42 )  దుస్సంఘటన మరవక ముందే మరో ఇద్దరు రోడ్డు దాటుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రవాసీయులని కలవరపెడుతుంది. ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ రాజధాని ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్ జేయూది ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ వాహనదారులు గుర్తించలేని ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా  ప్రజలు ఎట్టి పరిస్థితులలోను  దాటకూడదని  హెచ్చరించారు. పాదచారులు మరియు కర్ర ఊతంతో నడిచేవారు సంచరించే సమయంలో  వాహనాల వేగాన్ని సైతం  తగ్గింఛి  మరియు రహదారిపై శ్రద్ద  పెట్టాలని ఆయన  డ్రైవర్లను  కోరారు. అతను ట్రాఫిక్ చట్టాలు, వేగ పరిమితులు మరియు వాహనాలు మధ్య సురక్షితమైన దూరానికి  గౌరవించడానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com