బహ్రెయిన్ లో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్, ఎగ్జిబిషన్
- July 04, 2023
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ రెండవ ఎడిషన్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు రోజుల ఈవెంట్ డిసెంబర్ 5 న ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఒక ప్రకటనను విడుదల చేశారు. జాతీయ భద్రత మరియు ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభంగా సైబర్ భద్రత ప్రాముఖ్యతను అందులో వివరించారు. "బహ్రెయిన్ భద్రత, శ్రేయస్సు సురక్షితమైన ICT మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది" అని లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. రాబోయే కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీకి అనుగుణంగా ఉన్నాయని, కొత్త టెక్నాలజీని అన్వేషించడం, గ్లోబల్ సైబర్‌స్పేస్ అభివృద్ధిని నేర్చుకోవడం, వ్యవహరించడం లక్ష్యంగా ఉన్నాయని షేక్ నాజర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







