పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకు ఊరట..!
- July 04, 2023
న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్ణాటక కోలార్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ.. ప్రధానిని ఉద్దేశించి.. ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్లో నమోదైన కేసు విచారణ సందర్భంగా రాహుల్కు హైకోర్డు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.
జస్టిస్ సంజయ్ కుమార్ ద్వివేది బెంచ్ పిటిషన్పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు.. సమాధానం ఇవ్వాలని పిటిషనర్ ప్రదీప్ మోదీని ఆదేశించింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి ఊరటనిస్తూ.. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. రాంచీలో రాహుల్ గాంధీపై బిజెపి నేత ప్రదీప్ మోదీ పరువునష్టం కేసు వేశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







