యూట్యూబ్‌ తరహాలో రానున్న 'వీడియో డైరెక్ట్‌'

- May 14, 2016 , by Maagulf
యూట్యూబ్‌ తరహాలో రానున్న 'వీడియో డైరెక్ట్‌'

ఈ-కామర్స్‌ రంగంలో దూసుకెళ్తున్న అమెజాన్‌.. సోషల్‌మీడియా రంగంలోనూ సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన యూట్యూబ్‌కు పోటీగా 'వీడియో డైరెక్ట్‌' పేరుతో కొత్త వీడియో సేవలను ప్రారంభించింది.
యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసిన వారికి.. ఆ వీడియోలపై వచ్చే ప్రకటనల ఆదాయంలో గూగుల్‌ షేర్‌ ఇస్తుంది. ఎంతమంది ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉంటే.. అంత ఎక్కువగా ఆదాయం పొందే వీలుంటుంది. ఇప్పుడు వీడియో డైరెక్ట్‌లోనూ అదే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది. వీడియోలను అప్‌లోడ్‌ చేసిన వారికి 'అమెజాన్‌ ప్రైమ్‌' సబ్‌స్క్రైబర్ల నుంచి పొందిన ఆదాయంలో షేర్‌ ఇవ్వనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com