శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారికి వంశీ స్వర్ణోత్సవ జ్ఞాపిక బహూకరణ

- July 06, 2023 , by Maagulf
శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారికి వంశీ స్వర్ణోత్సవ జ్ఞాపిక బహూకరణ

హైదరాబాద్: అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ, వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా, వంశీ వ్యవస్థాపకులు, ఫిలిం సెన్సార్ బోర్డ్ మరియు నంది ఫిల్మ్ అవార్డ్స్ పూర్వ సభ్యులు, కళాబ్రహ్మ, శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు దత్త పీఠ ఉత్తరాధికారి, పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామివారిని, , శ్రీ కార్యసిద్ధి పంచముఖాంజనేయ స్వామి దేవాలయం, బీ.హెచ్.ఈ.ఎల్., రామచంద్రపురంలో దర్శించి, వారిని సత్కరించి, వంశీ సర్ణోత్సవ జ్ఞాపికను బహూకరించారు... ఈ సందర్భంగా స్వామివారు, అర్థ శతాబ్దిగా, వంశీ చేస్తున్న సేవలను అభినందిస్తూ, కొన్ని దశాబ్దాల నుంచి అవధూత పీఠాధిపతి, జగద్గురు, పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు, పుష్కలంగా, వంశీ వారికి ఉన్నాయనీ, వారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎంతో శ్లాఘనీయమని అన్నారని, వంశీ రామరాజు ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com