మెగా రేస్ నుంచి తప్పుకున్న ‘టిల్లు స్క్వేర్’.!

- July 06, 2023 , by Maagulf
మెగా రేస్ నుంచి తప్పుకున్న ‘టిల్లు స్క్వేర్’.!

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజె టిల్లు’ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. ఆ క్రమంలో ఆల్రెడీ అధికారికంగా ఆ డేట్‌ని అనౌన్స్ చేశారు కూడా. మెగాస్టార్ చిరంజీవితో టిల్లు గాడు సై అంటే సై అంటూ హెడ్డింగులు పెట్టి మీడియాలో కథనాలు కూడా వేడి వేడిగా వెలువడ్డాయ్.
అయితే, ఏమైందో ఏమో కానీ, ‘టిల్లు స్క్వేర్’ ఈ రేస్ నుంచి తప్పుకుంది. సెప్టెంబర్‌ వరకూ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో నిలబడి గెలవలేం అనుకున్నాడో ఏమో, సిద్దు జొన్నలగడ్డ పక్కకి తప్పుకున్నాడు. 
మంచిదే.! ‘టిల్లు స్క్వేర్’పై మంచి అంచనాలున్నాయ్. సో, ఆ అంచనాల్ని అందుకోవాలంటే, ఇలాంటి కొన్ని ముందు జాగ్రత్తలు తప్పవు మరి. టిల్లుగానితో అట్లుంటది.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com