దుబాయ్ ట్రాఫిక్ చట్టం సవరణ: ఉల్లంఘనల జాబితా, జరిమానాలు

- July 07, 2023 , by Maagulf
దుబాయ్ ట్రాఫిక్ చట్టం సవరణ: ఉల్లంఘనల జాబితా, జరిమానాలు

యూఏఈ: అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, రెడ్ లైట్ జంప్ చేయడం దుబాయ్‌లో తీవ్రమైన ట్రాఫిక్ నేరాలలో ఒకటిగా ఉన్నాయి. ఇకపై వాహనదారులు జప్తు చేసిన వాహనాలను విడిపించుకోవడానికి Dh50,000 చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు దుబాయ్‌లో ట్రాఫిక్ చట్టానికి పలు సవరణలు చేశారు. ఇవి జూలై 6 నుండి అమలులోకి వచ్చాయి. వాహనాన్ని నిర్లక్ష్యంగా లేదా ప్రాణాలకు లేదా ఆస్తులకు ప్రమాదం కలిగించే రీతిలో నడపడం.రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, నకిలీ, అస్పష్టమైన లేదా చట్టవిరుద్ధంగా ఉపయోగించిన నంబర్ ప్లేట్‌తో వాహనాన్ని నడపడం, పోలీసు వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడం లేదా ఉద్దేశపూర్వకంగా దానికి నష్టం కలిగించడం, 18 ఏళ్లలోపు వ్యక్తి వాహనం నడపడం లాంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.  ఈ తీవ్రమైన ట్రాఫిక్ నేరంతో జప్తు చేయబడిన వాహనాలను విడుదల చేయడానికి Dh100,000 కఠినమైన జరిమానా చెల్లించాలి. పోలీసుల నుండి ముందస్తు అనుమతి లేకుండా రోడ్ రేస్‌లో పాల్గొడాన్ని కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తారు.

వాహనంలో గణనీయమైన మార్పులు చేయడం వలన వేగం, శబ్దం లేదా ఆపరేషన్ సమయంలో లేదా డ్రైవింగ్ సమయంలో ఆటంకాలు పెరుగడం,పోలీసులను తప్పించుకోవడం, సెన్స్ ప్లేట్లు లేకుండా వాహనం నడపడం, రేసులను చూడటం లేదా వాటి ఫలితంగా అస్తవ్యస్తమైన కార్యకలాపాలలో పాల్గొనడం లేదా రోడ్డుపై వాహనాలను ప్రదర్శించడం, వాహనం కిటికీలకు అనుమతించబడిన టింట్ శాతాన్ని అధిగమించడం లేదా అనుమతి లేకుండా ముందు విండ్‌షీల్డ్‌కు రంగు వేయడం లాంటివి చేస్తే స్వాధీనం చేసుకున్న వాహనాలను Dh10,000 చెల్లించిన తర్వాత మాత్రమే విడుదల చేస్తారు.

మొత్తం ట్రాఫిక్ జరిమానాలు Dh6,000 దాటితే దుబాయ్ పోలీసులు పరిపాలనాపరంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న వాహనం యజమాని విధించిన ట్రాఫిక్ జరిమానాలను చెల్లించిన తర్వాత విడుదల చేస్తారు. జప్తు వ్యవధి ముగిసిన తర్వాత వాహన యజమాని జప్తు చేయబడిన వాహనాన్ని క్లెయిమ్ చేయకపోతే, వారు జప్తు వ్యవధి ముగిసిన తర్వాత ప్రతి రోజుకు Dh50 మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. అదే నేరం జరిగినప్పటి నుండి ఒక సంవత్సరంలోపు వాహనం మళ్లీ స్వాధీనం చేసుకున్నట్లయితే, విడుదల చేసిన మొత్తం Dh200,000 మించకుండా ఉంటే, స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి చెల్లించాల్సిన మొత్తం రెట్టింపు చేయబడుతుందని ట్రాఫిక్ విభాగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com