SIIMA అవార్డుల 11వ ఎడిషన్‌కు దుబాయ్ ఆతిథ్యం

- July 07, 2023 , by Maagulf
SIIMA అవార్డుల 11వ ఎడిషన్‌కు దుబాయ్ ఆతిథ్యం

దుబాయ్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 11వ ఎడిషన్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో  SIIMA వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరుగనున్నాయి. జూలై 6న దుబాయ్‌లోని హబ్టూర్ ప్యాలెస్ హోటల్‌లో దక్షిణ భారత సూపర్‌ స్టార్లు రానా దగ్గుబాటి,  మృణాల్ ఠాకూర్ సమక్షంలో SIIMA చైర్‌ పర్సన్ బృందా ప్రసాద్, అధికారిక హోస్ట్ పార్టనర్ ట్రక్కర్స్ డైరెక్టర్ విశాల్ మహాజన్ ఈ మేరకు ప్రకటించారు. ఈ SIIMA 11వ ఎడిషన్ లో రామ్ చరణ్, ధనుష్, యష్, పృథ్వీరాజ్ వంటి స్టార్స్ సందడి చేయనున్నారు. అలాగే రానా దగ్గుబాటి, రష్మిక, మృణాల్ ఠాకూర్, నయనతార, పూజా హెగ్డే దక్షిణ భారత సినిమా అతిపెద్ద రెడ్ కార్పెట్ షోలో మెరువనున్నారు. కీర్తి శెట్టి, హనీ రోజ్, నిధి అగర్వాల్, శాన్వి తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారని ట్రక్కర్స్ డైరెక్టర్ విశాల్ మహాజన్ తెలిపారు.

ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. సైమా తనకు చాలా ప్రత్యేకమైనదని, నాలుగు పెద్ద సినిమా పరిశ్రమలు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) తమ విజయాన్ని జరుపుకోవడానికి ఇది వేదికన్నారు. తనకు SIIMAతో 11 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లలో దక్షిణ భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి SIIMA వేదికను 2012లో ప్రారంభించారు. సెప్టెంబరు 14వ తేదీన మిడిల్ ఈస్ట్ రీజియన్ లోని దక్షిణ భారత వ్యాపార సంఘాన్ని ప్రొత్సహించేందుకు SIIMA బిజినెస్ అవార్డుల కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com