డెయిర్ ఎజ్జోర్ ఉగ్ర దాడిలో 20 మంది మృతి

- May 14, 2016 , by Maagulf
డెయిర్ ఎజ్జోర్ ఉగ్ర దాడిలో 20 మంది మృతి

డెయిర్ ఎజ్జోర్ తూర్పుప్రాంత పట్టణంలోని ఓ సిరియన్ ఆస్పత్రిపై ఐసిస్(ఐఎస్ఐఎస్) టెర్రరిస్టులు శనివారం దాడికి తెగబడ్డారు. 20 మంది సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అక్కడి అల్ అసద్ ఆస్పత్రిపై దాడి జరిగిందని, 20 మంది సైనికులు మృతి చెందారని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఘటన సందర్భంగా భధ్రతాదళాలు జరిపిన ఎదురుదాడిలో ఆరుగురు టెర్రరిస్టులు కూడా హతమయ్యారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com