ప్రతిరోజూ ఉత్సాహంగా గడవాలంటే..

- May 14, 2016 , by Maagulf
ప్రతిరోజూ ఉత్సాహంగా గడవాలంటే..

ప్రతిరోజూ ఉత్సాహంగా గడవాలని అనుకుంటారు అందరూ. అయితే దానికి తగిన ప్లానింగ్ లేకపోవడంతో గందరగోళం అయిపోతుంటారు. ఆదరాబాదరగా రోజు మొదలుపెడితే చేయబోయే పనులపై ఆ ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనం నిద్ర లేచిన పద్దతి బట్టే ఆ రోజు ఆధారపడి ఉంటుందట. వారి సూచనల మేరకు ఇలా చేసి ఉత్సాహవంతమైన వెలుగును మీ మనసులో నింపుకోండి.
- పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్‌ చూడడం చేయరాదు.. ఇవి మీ మూడ్‌ను పాడుచేస్తాయి. నిద్రలేవగానే ఓ జోక్‌ చదవడం, అద్దంలో మీ ముఖం చూసుకొని బలవంతంగానైనా 20సెకన్లు నవ్వండి. - లేవగానే మీ ఇంట్లో వారికి గుడ్‌ మార్నింగ్‌ చెప్పండి. - నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది. - రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది. - పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్‌, ప్రోటీన్స్‌ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్‌ అండ్‌ ఫిట్‌ గా ఉంచుతాయి. మనకు కొండంత ఎనర్జీని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. - ప్రతిరోజు ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. - నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే ఆ అలవాటు చేసుకోండి. - రోజూ హాయిగా ఉండడానికి ఉదయం పూట మెలోడీ లేదా మీకు నచ్చిన సంగీతం వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది.? అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com