విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం..
- May 14, 2016
వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈనెల 9న కుటుంబ సమేతంగా ఆయన థాయ్‌లాండ్ వెళ్లారు. ఏటా వేసవిలో కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల పాటు వ్యక్తిగత పర్యటనకి వెళ్లడం చంద్రబాబుకు ఆనవాయితీ. విదేశీ పర్యటన ముగించుకుని అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా 2గంటల సమయంలో విజయవాడలోని తన నివాసానికి వచ్చారు. ఇవాళ, రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానికి ఇవ్వాల్సిన నివేదికపై సీఎం పూర్తిస్థాయిలో కసరత్తు చేయనున్నారు. రేపు తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రధానికి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై కసరత్తు చేయనున్నారు. ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు మహానాడు నిర్వహణ, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







