శ్రీ విష్ణు విషయంలో అలా జరుగుతోందా.?

- July 08, 2023 , by Maagulf
శ్రీ విష్ణు విషయంలో అలా జరుగుతోందా.?

శ్రీ విష్ణు మంచి నటుడు. విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలడు. కామెడీ రోల్ అయినా, సీరియస్ రోల్ అయినా, విలన్ అయినా, పక్కింటబ్బాయ్ అయినా.. ఇలా ఏ పాత్ర తీసుకున్నా శ్రీ విష్ణు పరకాయ ప్రవేశం చేసేస్తాడు. 
అయితే, స్టార్ డమ్ దక్కడం లేదెందుకో శ్రి విష్ణుకి. లేటెస్ట్‌గా ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమాకి టాక్ బాగుంది. సూపర్ హిట్ అనదగ్గ సినిమానే కూడా. వసూళ్లు బాగా వస్తున్నాయ్. అయినా కానీ, ఈ సినిమా గురించి మాట్లాడుకునే వాళ్లే కరువాయె. 
కంటెంట్ లేని సినిమాలు హిట్టూ సూపర్ హిట్టూ.. అంటూ సంచలనాలు సృష్టిస్తున్నాయ్ ఈ మధ్య. అలాంటప్పుడు ‘సామజవరగమన’ వంటి మంచి కంటెంట్ వున్న సినిమాల గురించి మాట్లాడుకోకపోవడం దురదృష్టకరం. ఇలాంటి కంటెంట్ వున్న సినిమాలకు ఆదరణ దక్కాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కానీ, ఎందుకో తెలీదు శ్రీ విష్ణుని తొక్కేస్తున్నారు.. అంటూ ప్రచారం జరుగుతోంది. 
ఎందుకలా జరుగుతోందో తెలీదు కానీ, ‘సామజవరగమన’ సినిమాని ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చేస్తే వర్కవుట్ అయ్యి వుండేదేమో అని శ్రీ విష్ణు సన్నిహితులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com