గురక ఇబ్బంది పెడుతోందా.?
- July 08, 2023ఆదునిక జీవన శైలిలో గురక సమస్య చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తోంది. గురక సమస్యతో గాఢ నిద్రలోంచి ఉలిక్కి పడి లేవడమే కాకుండా.. పక్కనున్న వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది.
మరి, గురక సమస్యకు మెడిసన్ లేదా.? అంటే, వుంది. కానీ, అవన్నీ కేవలం తాత్కాలికమైన పరిష్కారాలే. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకున్నప్పటికీ గురక సమస్య నుంచి విముక్తి కలగలేదని ఓ సర్వేలో తేలింది.
మరి, ఏం చేయాలి.? గురక సమస్యనుంచి ఉపశమనం పొందాలంటే ఒక్కటే మార్గం అది వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గురక తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయుల్లో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. బరువు తగ్గడం ఒక్కటే వారి ఈ సమస్యకు పరిష్కారం.
అలాగే స్లీపింగ్ పొజిషన్ కూడా గురక సమస్యను తీర్చుతుందని నిపుణులు చెబుతున్నారు. గురక రావడానికి కారణం ముక్కలో చేరిన దుమ్ము ధూళి వంటి వ్యర్ధాలు కూడా. అందుకే పడుకునే ముందు ముక్కును బాగా శుభ్రం చేసుకోవాలి.
ఈ చిన్న చిన్న చిట్కాలు పాఠించి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్టుల్లేకుండా గురక నుంచి ఉపశమనం పొందొచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు