బహ్రెయిన్ లో రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలుశిక్ష
- July 10, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలు శిక్షను కాసేషన్ కోర్ట్ సమర్థించింది. అతను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అధికారంపై తప్పుడు ఆరోపణలు చేసి దాని ప్రతిష్టను దిగజార్చాడని నిర్ధారించింది. నార్తర్న్ గవర్నరేట్‌లోని ఎలక్టోరల్ అథారిటీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ ఆన్లైన్ వీడియోలను ప్రసారం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చింది. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎన్నికల అధికారాన్ని కించపరిచినందుకు అభ్యర్థిపై అభియోగాలు మోపింది. మొదటగా ట్రయల్ కోర్టు సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, తీర్పుపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పీల్ చేయడంతో శిక్షను మరో మూడు నెలలకు పెంచారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









