ఒమన్ లో లంచం తీసుకున్న అధికారికి 5 ఏళ్ల జైలుశిక్ష
- July 11, 2023
మస్కట్: లంచం, ఫోర్జరీ మరియు పదవీ దుర్వినియోగానికి సంబంధించి అనేక నేరాలు, దుర్వినియోగాలకు పాల్పడిన నలుగురు పౌరులకు ఐదు నుండి రెండేళ్ల వరకు శిక్ష పడింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగికి ఐదేళ్ల జైలు శిక్ష, OMR 48,000 జరిమానా విధించారు. దీంతోపాటు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించారు. అలాగే లంచం ఇచ్చినందుకు మరో వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, OMR 48,000 జరిమానా విధించారు.
క్రింది వారిని దోషులుగా నిర్ధారిస్తూ, క్రిమినల్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించి శిక్షలను ఖరారు చేసింది.
1- మూడు నేరాలతో సేలం బిన్ మసూద్ బిన్ సలేం (అధికారిక పత్రంలో ఫోర్జరీ చేయడం, లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం, అధికార దుర్వినియోగం.
2- ఇషాక్ బిన్ అహ్మద్ బిన్ సయీద్ రెండు నేరాలు (అధికారిక పత్రంలో ఫోర్జరీ, లంచం స్వీకరించడం, పదవిని దుర్వినియోగం చేయడం).
3- అహ్మద్ బిన్ ఖల్ఫాన్ బిన్ ఖలాఫ్ రెండు నేరాలు (అధికారిక పత్రంలో ఫోర్జరీ, లంచం స్వీకరించడం). దీంతోపాటు సమాచార సాంకేతికత, సమాచార నెట్‌వర్క్‌ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ డేటాను దుర్వినియోగం చేశారు.
4- అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ సయీద్ రెండు నేరాలతో (నకిలీ అధికారిక పత్రాన్ని ఉపయోగించడం, మరో ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వడం), దుష్ప్రవర్తన నేరాలను కోర్టు నిర్ధారించి శిక్షులు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









