వాహనానికి నిప్పంటించిన సౌదీ పౌరుడి అరెస్ట్

- July 11, 2023 , by Maagulf
వాహనానికి నిప్పంటించిన సౌదీ పౌరుడి అరెస్ట్

రియాద్: వాడి అల్-దవాసిర్ గవర్నరేట్ లో ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పు పెట్టినందుకు సౌదీ పౌరుడిని రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓనర్‌తో వివాదం తలెత్తడంతో సదరు పౌరుడు వాహనానికి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. అలాగే సౌదీ అరేబియా యాంటీ-సైబర్ క్రైమ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతను సంఘటనను డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించాడు. పౌరుడు వాహనానికి నిప్పంటిస్తున్నప్పటి సీసీ ఫుటేజీని పబ్లిక్ సెక్యూరిటీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నిందితుడిని అరెస్టు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com