‘డబుల్ ఇస్మార్ట్’ ప్రపంచంలోకి ఉస్తాద్ రామ్ గ్రాండ్ ఎంట్రీ.!
- July 11, 2023
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా మొదలెట్టేయనున్నారు పూరీ అండ్ టీమ్.
ఈ నేపథ్యంలో రామ్ తాజా లుక్స్‌కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో ఉస్తాద్ రామ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో పూర్తి మాస్ లుక్స్‌లో కనిపించిన రామ్ పోతినేని, ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం కంప్లీట్ స్మార్ట్ లుక్స్‌లోకి మారిపోయినట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ బోయపాటి సినిమా కోసం మాస్ లుక్స్‌లో కనిపించిన రామ్ పోతినేని, తాజా సినిమా కోసం చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రామ్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత పూరీ చేస్తున్న సినిమా ఇది. చూస్తుంటే, పక్కా ప్లానింగ్‌తో పూరీ జగన్నాధ్ ఈ సినిమాని లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూట్ స్టార్ట్ అవ్వకుండానే, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు. అదీ పూరీ డేరింగ్ అంటే. వచ్చే ఏడాది మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







