ధైరాయిడ్ వున్నవాళ్లు ఈ పండ్లను తప్పక తినాల్సిందే సుమీ.!

- July 11, 2023 , by Maagulf
ధైరాయిడ్ వున్నవాళ్లు ఈ పండ్లను తప్పక తినాల్సిందే సుమీ.!

థైరాయిడ్ సమస్య కారణంగా మహిళల్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయ్. ముఖ్యంగా ఊబకాయం. అలాగే, పీసీఓడీ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమారదముంది. అయితే, ఈ సమస్య వున్నవాళ్లు వైద్యులు సూచించిన మందులతో పాటూ, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 

ముఖ్యంగా ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లను తినడం వల్ల ధైరాయిడ్ నియంత్రణలో వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది పైనాపిల్. ఈ పండులో అధిక మొత్తంలో సీ విటమిన్, మాంగనీస్ ఖనిజం వుంటాయ్. థైరాయిడ్‌ని నియంత్రించే గుణం వీటికి చాలా ఎక్కువ. 

అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే నారింజ పండు కూడా థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. ఇందులోని విటమిన్లు ప్రీ రాడికల్స్‌ని నియంత్రిస్తాయ్. తద్వారా ధైరాయిడ్ కంట్రోల్‌లో వుంటుంది.

అలాగే బ్లాక్ బెర్రీస్ కూడా ప్రీ రాడికల్స్‌ని తటస్థీకరిస్తాయ్. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయ్. ప్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయ్. స్ట్రాబెర్రీస్, యాపిల్ కూడా థైరాయిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో తోడ్పడే అతి ముఖ్యమైన పండ్ల జాతులు. సో, ప్రతీరోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ బారిన పడే అవకాశాలు తక్కువ. అలాగే, ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడేవారికి ఉపశమనం ఎక్కువ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com