ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‍లకు టికెట్ల ధరలు వచ్చేశాయ్..
- July 11, 2023
కోల్‌కతా: ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్ – 2023 మెగా టోర్నీ భారత్ వేదికగా జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. భారత్‌లో మొత్తం పది మైదానాల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మైదానాల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఇక్కడ లీగ్, సెమీఫైనల్ -2 మ్యాచ్‌తో కలిపి ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మైదానంలో జరిగే మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ గ్రౌండ్‌లో టికెట్ల ధరలు ఎలా ఉంటాయనేదానిపై అయోమయం నెలకొంది. మంగళవారం ఈ విషయంపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) స్పష్టం ఇచ్చింది.
ప్రపంచ కప్ 2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు ధరలు రూ. 650 నుంచి రూ. 3వేల వరకు ఉన్నాయి. భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్, సెమీస్‌కు ఒకే రకమైన ధరలను నిర్ణయించగా, మిగతా మూడు మ్యాచ్‌లకు వేరువేరు ధరలతో టికెట్లను క్యాబ్ విక్రయించనుంది. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌లో 63,500 మంది మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
మ్యాచ్‌ల వారిగా టికెట్ ధరల వివరాలు..
బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ రూ. 650, డీ, హెచ్ బ్లాక్‌లకు రూ. వెయ్యి, బీ, సీ, కే, ఎల్ బ్లాక్‌లకు రూ. 1,500.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ రూ. 800, డీ,హెచ్ బ్లాక్ లు రూ. 1200, సీ,కె, బ్లాక్‌లు రూ. 2000, బి, ఎల్ బ్లాక్‌లు రూ. 2,200.
బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ రూ. 800, డీ,హెచ్ బ్లాక్‌లు రూ. 1200, సీ,కె బ్లాక్‌లు రూ. 2000, బీ,ఎల్ బ్లాక్‌లు రూ.2200.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌కు ..
అప్పర్ టైర్స్ రూ. 900, డీ,హెచ్ బ్లాక్‌లు రూ. 1500, సీ,కె బ్లాక్‌లు రూ. 2,500, బీ,ఎల్ బ్లాక్‌లు రూ. 3వేలు .
సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ ధరలు..
అప్పర్ టైర్స్ రూ. 900, డీ, హెచ్ బ్లాక్‌లు రూ. 1500, సీ, కె బ్లాక్ లు రూ. 2,500, బీ,ఎల్ బ్లాక్ లు రూ. 3వేలు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







