నిర్దేశించని ప్రాంతాలలో రోడ్డు దాటితే 400 దిర్హామ్ జరిమానా
- July 11, 2023
యూఏఈ: పాదచారుల ఉల్లంఘన గురించి షార్జా పోలీసులు సోషల్ మీడియాలో వార్నింగ్ రిమైండర్ జారీ చేశారు. నిర్దేశించని ప్రాంతాలలో రోడ్లు దాటడం వల్ల 400 దిర్హామ్ జరిమానా విధించబడుతుందని అందులో హెచ్చరించారు. ఈ ఉల్లంఘన ప్రమాదాలకు, ప్రాణనష్టానికి కూడా దారి తీస్తుందని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో 34 ఏళ్ల ఆసియా వ్యక్తి పాదచారుల క్రాసింగ్ కోసం అనుమతి లేని స్థలం నుండి రోడ్డు దాటుతున్నప్పుడు రెండు వేర్వేరు వాహనాలు ఢీకొని మరణించాడు. బాధితుడు రోడ్డుకు అడ్డంగా సైకిల్‌పై వెళుతుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఇతర ఎమిరేట్లకు చెందిన పోలీసులు కూడా రోడ్డుపై ప్రమాదాలకు దారితీసే ఉల్లంఘనల గురించి, అలాగే వారు మీకు విధించే జరిమానాలు, బ్లాక్ పాయింట్ల గురించి పదేపదే రిమైండర్లను జారీ చేస్తున్నారు. గత వారమే దుబాయ్‌లో ట్రాఫిక్ చట్టానికి చేసిన సవరణలు అమలులోకి వచ్చాయి. వాటిలో 100,000 వరకు జరిమానాలు ఉన్నాయి. రహదారులపై భద్రతను పెంచేందుకు, మరణాలను తగ్గించేందుకు కొత్త జరిమానాలను అమలు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







