తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన
- May 14, 2016
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో అనూహ్యంగా విద్యార్థుల నమోదు ఎందుకు తగ్గిపోయిందని.. దీనిపై తమకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇంతటి తీవ్రమైన సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్వరంగా స్పందించి వెంటనే ఉపశమన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల చేరిక పెరిగే చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశించింది.ఇప్పటికే నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందని.. దాని ద్వారా మాత్రమే విద్యార్థుల నమోదు పెరగదని చెప్పింది. పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి పరిశీలనలు జరిపి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని.. వారిని ఆకర్షించే విధానాలు ప్రారంభించాలని సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







