అజమాన్ లో అగ్నిప్రమాదం ఫర్నిచర్ షాపు దగ్దం సమీపంలోని భవనాలు ఖాళీ చేయించారు ; ప్రాణ నష్టం లేదు

- May 14, 2016 , by Maagulf
అజమాన్ లో  అగ్నిప్రమాదం  ఫర్నిచర్ షాపు దగ్దం సమీపంలోని భవనాలు ఖాళీ చేయించారు ; ప్రాణ నష్టం లేదు

 

అజమాన్ :ముషరఫ్ల జిల్లా అజమాన్ లో  శుక్రవారం మధ్యాహ్నం ఒక ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా తగలబడిపోయింది. కాగా  ఏ మరణాలు నమోదు కాలేదు .
అగ్ని ప్రమాదంలో దుకాణం పూర్తిగా భస్మీపటలం  కాబడిందని అజమాన్  పౌర రక్షణ మీడియా మరియు ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ కల్నల్ నాజర్ రషీద్ అల్ జిరి తెలిపారు.అగ్నిమాపక దళం అగ్నిజ్వాలలను నియంత్రించడానికి శ్రమించారు. మరియు పొరుగునున్న భవనాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. పోలీసులు షాప్ కు దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు ఎందుకంటే  అగ్నిమాపక మరియు అంబులెన్స్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి  వేగంగా చేరుకోవడానికి ఈ ఏర్పాటు చేసినట్లు అల్ జిరి  చెప్పారు.ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం  గుర్తించడానికి  ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి వేగంగా చేరుకొన్నారు. అగ్నిమాపక వ్యవస్థలు అలాగే వారి  స్టోర్ పదార్థాలు నిర్వహించడానికి పారిశ్రామిక సదుపాయాలను సరిగా ఏర్పాటు చేసుకోవాలని, అలాగే  దుకాణం లోపల సిగరెట్ తాగకూడదని  యజమానులకు అల్ జిరి వారికి విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com