సినిమాలు దండగ.! వెబ్ సిరీస్‌లే పండగ.!

- July 12, 2023 , by Maagulf
సినిమాలు దండగ.! వెబ్ సిరీస్‌లే పండగ.!

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకునేవారు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలు చేస్తే ఏమొస్తుంది.? వెబ్ సిరీస్‌లు చేస్తే తమలోని అసలు సిసలు టాలెంట్‌కి పదునొస్తుంది.. దాంతో పాటూ, అవకాశాలు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయ్. 

ఇదీ నేటి తరం ఆర్టిస్టులు.. కాదు, ఫేడవుట్ ఆర్టిస్టుల పరిస్థితి కూడా. అందుకే సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడడం మానేశారు ఇప్పటికే చాలా మంది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఓటీటీ ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు నటీ నటులు. 

ముఖ్యంగా ఫిమేల్ ఆర్టిస్టులకు ఓటీటీ పండగే అని చెప్పొచ్చు. సెన్సార్ లేని ఛానెల్ కాబట్టి.. అవసరం అనుకుంటే విచ్చల విడిగా గ్లామర్ పండించొచ్చు.. పర్‌ఫామెన్స్ కావాలంటే, ఓపెన్‌గా తమలోని టాలెంట్ అంతా రంగరించేయొచ్చు..

సో, సినిమాలు వద్దు.. వెబ్ సిరీస్‌లే ముద్దు.. అనుకుంటున్నారట కొందరు ముద్దుగుమ్మలు. తమన్నా, కాజల్, సమంత తదితర స్టార్ భామలైతే, ఓ వైపు సినిమాలూ, మరోవైపు సిరీస్‌లూ కూడా కానిచ్చేస్తున్నారు. మేల్ యాక్టర్స్ కూడా ఏమీ తక్కువ కాదండోయ్. విక్టరీ వెంకటేష్ లాంటి బడా స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టారంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com