గాంఢీవధారి అర్జున.! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హై ఓల్టేజ్ యాక్షన్.!
- July 12, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ప్రూవ్ చేశారు.
ఇక, ప్రీ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. వేగంగా వెళుతున్న కారులోంచి దిగిన వరుణ్ తేజ్ గన్ను పట్టుకుని యాక్షన్ షురూ చేశారు.
వరుణ్ తేజ్ ముఖం కనిపించకుండానే, ఫాస్ట్ యాక్షన్ బిట్స్ కట్ చేశారు టీజర్‌లో. టీజర్ కోసం కట్ చేసిన ఈ యాక్షన్ బిట్సే ఇంత హై ఓల్టేజ్‌లో వుండడంతో, ఇక ఏ స్థాయిలో సినిమా స్ర్కీన్‌ప్లేని డిజైన్ చేశారో ప్రవీణ్ సత్తారు.. అని ఆయన అభిమానులు ఊహించేసుకుంటున్నారు.
ఇటీవలే మెగా ప్రిన్స్ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్ధం తర్వాత వస్తున్న సినిమా ఇది. చూడాలి మరి, మెగా రాకుమారుడికి లక్కు ఎలా కలిసొస్తుందో.
ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘గాంఢీవధారి అర్జున’. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బొమ్మ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







