గాంఢీవధారి అర్జున.! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హై ఓల్టేజ్ యాక్షన్.!
- July 12, 2023మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ప్రూవ్ చేశారు.
ఇక, ప్రీ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. వేగంగా వెళుతున్న కారులోంచి దిగిన వరుణ్ తేజ్ గన్ను పట్టుకుని యాక్షన్ షురూ చేశారు.
వరుణ్ తేజ్ ముఖం కనిపించకుండానే, ఫాస్ట్ యాక్షన్ బిట్స్ కట్ చేశారు టీజర్లో. టీజర్ కోసం కట్ చేసిన ఈ యాక్షన్ బిట్సే ఇంత హై ఓల్టేజ్‌లో వుండడంతో, ఇక ఏ స్థాయిలో సినిమా స్ర్కీన్‌ప్లేని డిజైన్ చేశారో ప్రవీణ్ సత్తారు.. అని ఆయన అభిమానులు ఊహించేసుకుంటున్నారు.
ఇటీవలే మెగా ప్రిన్స్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్ధం తర్వాత వస్తున్న సినిమా ఇది. చూడాలి మరి, మెగా రాకుమారుడికి లక్కు ఎలా కలిసొస్తుందో.
ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘గాంఢీవధారి అర్జున’. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బొమ్మ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు