భోజనం చేసిన వెంటనే నడక ఆరోగ్యమేనా.?
- July 12, 2023
చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేసే అలవాటుంటుంది. అవును నిజమే.. భోజనం చేసిన తర్వాత అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి పడుకుంటే తేలిగ్గా వుంటుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
అయితే, భోజనం చేసిన వెంటనే వాకింగ్ అనేది అందరికీ మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 15 నుంచి 20 నిముషాల తర్వాతే వాకింగ్ చేయడం మంచిదట.
అలా చేయడం వల్ల పొట్టలో అసౌకర్యం అనిపించకుండా వుంటుంది. అప్పటికీ అసౌకర్యం అనిపిస్తే, అరగంట తర్వాత వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
వయసు పైబడిన వారూ, గర్బిణీ స్ర్తీలలో తిన్న వెంటనే శరీరం చాలా బరువుగా, ఆయాసంగా వున్నట్లు తోస్తుంది. గర్భిణీ స్ర్తీలు భోజనం తర్వాత నెమ్మదిగా వాకింగ్ చేయడం మంచిదే అని చెబుతున్నారు.
ఆ మాటకొస్తే, భోజనం చేసిన వెంటనే శరీరం రెస్ట్ కోరుకుంటుంది. అలా రెస్ట్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. భోజనం తర్వాత కాస్త అటూ ఇటూ శరీరానికి కదలిక ఇస్తేనే మంచిది.
అది కేవలం తేలికపాటి వాకింగ్ రూపంలోనే సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత వేగంగా నడిచే నడక మాత్రం ప్రమాదకరమే సుమా.!
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







