ఎయిర్ ఇండియా విమానంలో వ్యక్తి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు

- July 13, 2023 , by Maagulf
ఎయిర్ ఇండియా విమానంలో వ్యక్తి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు

యూఏఈ: టొరంటో నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ సిబ్బందిని దుర్భాషలాడడం, లోపల ఉన్న లావేటరీ తలుపును పగలగొట్టినందుకు నేపాల్ జాతీయుడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం, నేపాల్ నివాసి మహేష్ సింగ్ పండిట్ అనే ప్రయాణికుడు తన సీటును 26E నుండి 26F కి మార్చుకున్నాడని, ఈ క్రమంలో ఎకానమీ క్లాస్ సిబ్బందిని దుర్భాషలాడడం ప్రారంభించాడని క్యాబిన్ సూపర్‌వైజర్ ఆదిత్య కుమార్ తెలిపారు. మరో 10 మంది ప్రయాణికుల సహాయంతో నిందితుడైన ప్రయాణికుడిని అదుపు చేయగలిగామని క్యాబిన్ సూపర్‌వైజర్ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. స్మోక్ అలారం రావడంతో అప్రమత్తమయ్యామని, లావెటరీ నుంచి పొగ రావడం గమనించి వెళ్లేలోగా సదరు నిందితుడు మమ్మల్ని తోసుకుంటూ.. దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడడని, అనంతరం ప్రయాణికుల సాయంతో నిలువరించినట్లు తన ఫిర్యాదులో కుమార్ పేర్కొన్నాడు.  ఢిల్లీ పోలీసులు ఐజీఐ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు 323/506/336 ఇండియన్ పీనల్ కోడ్,  22,23,25 ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ కింద కేసు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com