‘Bro The Avatar’ ఇది నెక్స్‌ట్ లెవల్ మేకింగ్ ‘బ్రో’.!
- July 13, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి సంబంధించి ఒక్కొక్కటిగా వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్‌కి పిచ్చ కిర్రాకెత్తిస్తున్నాయనే చెప్పాలి.
ఇంతవరకూ టీజర్, ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. రెండూ రెండే. టీజర్‌లో చాలా వరకూ కట్ చేసేశారు పవన్, తేజ్ కలిసి వున్న కాంబో సీన్లు.. దాంతో, టీజర్‌తోనే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇక ఆ తర్వాత వచ్చిన ‘మై డియర్ మార్కండేయ’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో తేజ్ స్టెప్పులేస్తుండగా, పవన్ కళ్యాణ్ అలా అలా కనిపించి తనదైన స్టైలింగ్‌తో పిచ్చ లేపేశాడు.
అయితే, ఎక్కడో కాస్త వెలితి.. అన్నట్లుగా ఈ సాంగ్‌పై అభిప్రాయాలు వచ్చాయ్ సోషల్ మీడియాలో. దాంతో, ఫాన్స్‌కి తాజా అప్‌డేట్ ఇచ్చారు ఈ సాంగ్ మేకింగ్ వీడియోతో. ఇది కదా అసలు సిసలు పవర్ అంటే. ఈ మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ జోష్‌కి ఫ్యాన్స్ ఎక్కడికో వెళ్లిపోతున్నారు. ఇది కదా జోష్ అంటే.! ఇది నెక్స్‌ట్ లెవల్ బ్రో అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
నిజంగానే ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ మేకింగ్ వీడియోలో. ‘బ్రో’ ఈ నెల 28న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.
తాజా వార్తలు
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్‌లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్‌పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!









