‘సిటాడెల్’ అప్‌డేట్ ఇచ్చిన సమంత.!
- July 13, 2023
హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ తెలుగు వెర్షన్‌లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రియాంకా చోప్రా నటించింది. ప్రియాంకా చోప్రా నటించిన ఈ హాలీవుడ్ వెర్షన్ ఇటీవలే ఓటీటీలో సందడి చేసింది. కానీ, అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే, ఆ సిరీస్ చూశాకా, సమంతను ఈ సిరీస్‌లో ఎలా చూపించారా.? అన్న అంశంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయిందంటూ సమంత సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది.
ఈ రోజు అనగా జూలై 13 తనకెంతో ప్రత్యేకమైనదిగా పేర్కొంది సమంత. ఇటీవల సమంత కొన్నాళ్లు విరామం తీసుకోబోతోందన్న వార్త ఫ్యాన్స్‌ని కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ లోపే తాను ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలనుకుంటోందట. అందులో భాగంగానే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పూర్తి చేసేసింది. ఇక, ‘ఖుషీ’ సినిమా లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా కూడా పూర్తి కానుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండతో సమంత జత కడుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో సమంత కొత్తగా కనిపిస్తోంది. రౌడీతో సమంత జోడీ ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









