ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి..
- July 13, 2023
బ్యాంకాక్: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. విశాఖకు చెందిన 23 ఏళ్ల జ్యోతికి అంతర్జాతీయ పోటీల్లో ఇదే తొలి స్వర్ణం. గురువారం జరిగిన ఫైనల్స్‌లో జపాన్ అథెట్లు టెరాడా సుకా(13.13 సెకన్లు), అయోకి మసుమి(13.26 సెకన్ల) కంటే అత్యుత్తమ ప్రదర్శన చేసి 13.09 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ పోటీల చరిత్రలోనే 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి దేశానికి తొలి స్వర్ణం అందించింది. జ్యోతి జాతీయ రికార్డు 12.82 సెకన్లుగా ఉంది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండో రోజు భారత్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. మహిళా 100 మీటర్ల హర్డిల్స్ రేసులో జ్యోతి యర్రాజీ, పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత అబ్దుల్లా అబూబకర్ లు స్వర్ణ పతకాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







