ఎల్.బి.శ్రీరామ్.. సెకెండ్ ఇన్నింగ్స్..

- May 15, 2016 , by Maagulf
ఎల్.బి.శ్రీరామ్.. సెకెండ్ ఇన్నింగ్స్..

ఎల్.బి.శ్రీరామ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నేటి తరానికి ఆయన నటుడిగా తెలిస్తే ముందుతరం వారికి ఆయనలోని రచయితా పరిచితుడే. దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఎల్.బి.శ్రీరామ్‌ చేత కామెడీ కావిడ పట్టించారు. దాన్ని చాలాకాలం ఆయన బాధ్యతగా మోస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో అయితే ఓ భారమైన సన్నివేశం తర్వాత హీరోగారు రెచ్చిపోయి విలన్లని తెగనరికే సీన్లు ఎన్ని చూసుంటాం. హీరో రౌద్ర రూపం దాల్చేలా ఆ ముందు సీన్ పండించడానికి ఈ ఇరవై ఎనిమిదేళ్ళ సినీ రంగ అనుభవం గల నటుడు ఉండాల్సింది. ఇన్నేళ్ళ సినీ జీవితంలో పరిశ్రమలోని లోటుపాటలు పరిపూర్ణంగా తెలుసుకున్న ఎల్.బి.శ్రీరామ్ త్వరలో సెకెండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టనున్నారు. నేటి ట్రెండ్‌కి తగినట్టు లఘుచిత్రాలతో వెబ్ ప్రపంచంలోనికి అడుగుపెట్టనున్నట్టు ఎల్.బి.శ్రీరామ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎల్.బి. (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) క్రియేషన్స్ బ్యానర్‌లో ఎల్.బి.శ్రీరామ్ హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు చేయనున్నారు. మే 30న తన పుట్టినరోజునే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న ఈయన కమర్షియల్ సినిమాలు కడుపు నింపడానికే అంటూ తనవైన భావాలు ఈ లఘుచిత్రాల ద్వారా వ్యక్తపరచడంతో మనసు నిండుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com