యూట్యూబ్‌ నుంచే స్నేహితులతో ఛాటింగ్‌ ..

- May 15, 2016 , by Maagulf
యూట్యూబ్‌ నుంచే స్నేహితులతో ఛాటింగ్‌ ..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్‌ ఒకటి. డెస్క్‌టాప్‌.. మొబైల్‌ అప్లికేషన్లతో కావల్సిన వీడియోలను అందించే సెర్చింజన్‌గా ఉపయోగపడుతోంది. తాజాగా నెటిజన్లను ఆకట్టుకునేందుకు యూట్యూబ్‌లో మరో సరికొత్త ఫీచర్‌ వస్తోంది. వీడియోలను వీక్షించడంతోపాటు.. యూట్యూబ్‌ నుంచే స్నేహితులతో ఛాటింగ్‌ కూడా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.యూట్యూబ్‌లో నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునో.. వీడియో లింక్‌ను వాట్సప్‌.. జీమెయిల్‌లో షేర్‌ చేసుకునే వీలుంది. కానీ.. త్వరలో అందుబాటులోకి తేనున్న మెసేజింగ్‌ ఫీచర్‌తో యూట్యూబ్‌లోనే సన్నిహితులకు.. స్నేహితులకు నచ్చిన వీడియోలను షేర్‌ చేసుకోవడంతోపాటు.. మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చట.ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ సరికొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్‌.. ఐఫోన్‌ వినియోగదారులకు త్వరలోనే పూర్తిస్థాయి వెర్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు యూట్యూబ్‌ వెల్లడించింది. ఈ మెసేజింగ్‌ సదుపాయం వచ్చాక వీడియోలు వీక్షిస్తూ.. ఛాటింగ్‌లు చేస్తూ యూట్యూబ్‌లోనే ఎక్కువ మంది కాలక్షేపం చేసే వీలుంటుందని టెక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com