2030 నాటికి 59 లాజిస్టిక్స్ జోన్ల ఏర్పాటు: సౌదీ అరేబియా
- July 16, 2023
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా 2030 నాటికి 59 లాజిస్టిక్స్ జోన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. లండన్‌లో జరిగిన రిసెప్షన్ సందర్భంగా సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ ఈ మేరకు ప్రకటించింది. రిసెప్షన్లో యూకేలోని సౌదీ రాయబారి ప్రిన్స్ ఖలీద్ బిఎన్ బందర్ బిన్ సుల్తాన్, రవాణా మరియు లాజిస్టిక్ సేవల డిప్యూటీ మంత్రి, రవాణా జనరల్ అథారిటీ యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్, అలాగే పలువురు రాయబారులు, ప్రతినిధులు, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సౌదీ రాయబారి మాట్లాడుతూ.. సముద్ర రంగం(మారిటైం సెక్టర్)లో సౌదీ అరేబియా సాధించిన అత్యుత్తమ విజయాలను వివరించారు. లాజిస్టిక్ సేవలలో గణనీయమైన అభివృద్ధి, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌తో సన్నిహిత సహకారం, సముద్ర పర్యావరణానికి మద్దతుతో సహా సాధించిన విజయాలు సౌదీ అరేబియా తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించే ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రవాణా మరియు లాజిస్టిక్స్ కోసం జాతీయ వ్యూహం సముద్ర అభివృద్ధి అన్ని అంశాలలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందని డాక్టర్ అల్-రుమైహ్ నొక్కిచెప్పారు. 2030 నాటికి లాజిస్టిక్స్ పనితీరు (LPI) ఇండెక్స్‌లో మొదటి పది దేశాలలో ఒకటిగా ఉండాలని రాజ్యం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో 59 లాజిస్టిక్స్ జోన్ల స్థాపన, 40 మిలియన్ కంటే ఎక్కువ కంటైనర్లకు పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం, సముద్ర పర్యావరణానికి మద్దతు ఇవ్వడంలో రాజ్యం గొప్ప పురోగతి సాధించిందని తెలిపారు. "ఇన్నోవేషన్ ఫర్ ఎ గ్రీన్ ఫ్యూచర్" అనే థీమ్‌తో సెప్టెంబరు 4-6, 2023 నుండి మారిటైమ్ ఇండస్ట్రీ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ నిర్వహించిన ఎగ్జిబిషన్లో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏజెన్సీలు పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







