జెడ్డాలో చర్చలు జరిపిన క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని

- July 17, 2023 , by Maagulf
జెడ్డాలో చర్చలు జరిపిన క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని

జెడ్డా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆదివారం విసృత చర్చలు జరిపారు. జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ మహ్మద్ కిషిదాకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అధికారిక రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సౌదీ-జపనీస్ విజన్ 2030కి అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు చర్చలు జరిపారు. వారు అనేక ప్రాంతీయ - అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం  జపాన్ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని జపాన్ కంపెనీల అధిపతులు, వ్యాపార యజమానుల బృందంతో క్రౌన్ ప్రిన్స్ సమావేశమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com