జపాన్‌కు వెళ్లడానికి వీసా నిబంధనలను సడలింపు: జపాన్ ప్రధాని కిషిడా
- July 18, 2023
యూఏఈ: జపాన్‌కు వెళ్లడానికి వీసాలు పొందడం ఇకపై సరళీకృతం కానుంది. ఒసాకాకు ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రకటించిన కొత్త సేవ రెండు దేశాల మధ్య విమాన ట్రాఫిక్‌ను పెంచుతుందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అబుధాబిలో తెలిపారు. సాధారణ పాస్‌పోర్ట్‌లు కలిగిన యూఏఈ పౌరులు జపాన్‌కు వెళ్లే ముందు విజిట్ వీసా పొందనవసరం లేదని, ప్రవాసులు ఇ-వీసా కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇకపై మిషన్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అలాగే, జాతీయ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ అక్టోబర్ 1 నుండి వారానికి ఐదుసార్లు ఒసాకాకు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉందన్నారు. కిషిదా తన మొదటి యూఏఈ పర్యటనలో యూఏఈ-జపాన్ బిజినెస్ ఫోరమ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. జపాన్‌కు తరచూ సేవలు అందించడం వల్ల వాణిజ్యం, పర్యాటకం మరియు వ్యాపార సంబంధాలు మరింత బలపడ్డాయి. జాతీయ విమానయాన సంస్థలు ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్ రెండూ జపాన్‌కు వారానికి 20 కంటే ఎక్కువ విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం