క్రౌన్ ప్రిన్స్ తో చర్చలు జరిపిన టర్కీ అధ్యక్షుడు
- July 18, 2023
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం జెడ్డాలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో చర్చలు జరిపారు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు మూడు రోజుల గల్ఫ్ పర్యటనలో భాగంగా ఎర్డోగాన్ సౌదీ అరేబియా చేరుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ టర్కీ అధ్యక్షుడికి అల్-సల్లం ప్యాలెస్‌లో అధికారికంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు అధికారిక చర్చలు, ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. మూడు గల్ఫ్ దేశాల పర్యటన సందర్భంగా ఎర్డోగాన్ సౌదీకి వచ్చారు. “గత 20 ఏళ్లలో సౌదీ అరేబియాలో మా కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రాజెక్టుల విలువ సుమారుగా 25 బిలియన్ డాలర్లు. సౌదీ అరేబియా భారీ-స్థాయి ప్రాజెక్టులలో టర్కీ కంపెనీలు ఎక్కువ పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాము, ” అని పర్యటనకు బయలుదేరే ముందు ఇస్తాంబుల్ లో మీడియాతో చెప్పారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం