యూఎస్ హెచ్-1బి వీసాదారులకు శుభవార్త
- July 18, 2023
అమెరికా: యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బి వీసాదారులు ఇక నుంచి కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1 బి వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది.
కెనడా ప్రభుత్వం 10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. యూఎస్ వీసాదారుల్లో ఉన్న సాంకేతిక ప్రతిభను ఆకర్షించడానికి కెనడా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. అత్యంత నైపుణ్యం ఉన్న కార్మికులను ఆకర్షించడానికి కెనడా యూఎస్ నుంచి హెచ్ 1 బి వీసా హోల్డర్లకు (US H-1B visa holders) ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది.
యూఎస్ వీసా ఉన్న వారు మూడు సంవత్సరాల పాటు కెనడాలో పనిచేసేందుకు అనుమతించనుంది. 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్లు, వారితో పాటు ఉన్ కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడియన్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. యూఎస్ వీసాదారులు కెనడాలో ఎక్కడైనా పనిచేసుకునేందుకు వీలుగా తాత్కాలిక నివాస వీసా ఇస్తారు.
భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. కెనడాలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో అగ్రగామిగా ఎదగాలని ఆశిస్తోంది. దీనిలో భాగంగానే యూఎస్ టెక్ దిగ్గజాలను ఆకర్షించేందుకు కెనడా ఈ పథకాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..