ఫెర్టిలిటీ (సంతానలేమి) సమస్య వున్నవారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
- July 18, 2023
సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు నేటి సమాజంలో చాలా మందే వున్నారు. ప్రస్తుత జీవన విధానం సంతానలేమి సమస్యను మరింత అధికం చేస్తోంది.
తద్వారా మాతృత్వానికి దూరమై అద్దె గర్భాలు (సరోగసీ), టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఐవీఎఫ్ వంటి పద్ధతుల్లి అనుసరించాల్సి వస్తోంది. ఇది అంత ఆషా మాషీ విషయం కాదు, బోలెడంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
అందుకే యుక్త వయసు నుంచే ఆడపిల్లలు తమ డైట్‌కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. మారిన ట్రెండ్.. ఆహార జీవన విధానం గర్భధారణపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మెజార్టీ మహిళలు పీసీఓడీ, థైరాయిడ్ తదితర ఇతర ఫెర్టిలిటీ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ సమస్య నుంచి తప్పించుకోవాలన్నా, లేక సరిచేసుకోవాలన్నా డాక్టర్ సూచించే మందులతో పాటూ, కొన్ని సహజమైన ఆహార నియమాల్ని కూడా పాఠించాల్సి వుంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్ వున్న మహిళలు పోషకాలు ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని అదుపు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
మానసిక ఆరోగ్యం బాగుంటే శరీరంలో ఇన్సులిన్, ఈస్ర్టోజన్ లెవల్స్ పెరుగుతాయ్. రోజువారి డైట్‌లో షుగర్స్, ఫ్యాట్స్ ఎక్కువగా వుంటే, రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ అమాంతం పెరిగి గర్భధారణపై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయ్.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..