ఒక్క వారంలో 53,859 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- July 18, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ (GTD) జూలై 8-14 నుండి ఒక వారంలో 53,859 ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేసింది. ఈ కాలంలో ట్రాఫిక్ కదలికలను క్రమబద్ధీకరించడానికి మరియు నిర్లక్ష్యపు వాహనదారులతో సహా ఉల్లంఘనలకు పాల్పడే వారిని ట్రాక్ చేయడానికి ఉద్దేశించిన ప్రచారాల సందర్భంగా డిపార్ట్‌మెంట్ 64 వాహనాలు, 54 సైకిళ్లను స్వాధీనం చేసుకుంది. మొత్తం 31 మంది బాలబాలికలు, 46 మంది ఇతర వ్యక్తులు చట్టాలను ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. చట్టం ప్రకారం 43 మంది వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, అలాగే 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అదే విధంగా పరారీలో ఉన్న 17 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్‌లను కలిగి ఉన్న 26 మందిని అరెస్టు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..