‘వార్ 2’ కథ అదేనా.?
- July 19, 2023‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఎన్టీయార్. ఈ క్రమంలోనే ఆయనకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అదే ‘వార్ 2’. బీభత్సమైన యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ‘వార్’ చిత్రం సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు అందుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమాగా చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘వార్ 2’లో తెలుగు స్టార్ హీరో అయిన ఎన్టీయార్‌ని కలుపుకుని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది.
భారీ బడ్జెట్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో హృతిక్, ఎన్టీయార్ స్నేహితుల్లా కనిపించబోతున్నారట. అయితే, అనుకోని కారణం, వీరిద్దరి మధ్య స్నేహాన్ని బద్ద శత్రుత్వంగా మార్చనుందట. ఆ క్రమంలోనే వీరి మధ్య జరిగే వార్ ఎలా వుండబోతోందన్న కథతో ‘వార్ 2’ రూపుదిద్దుకుంటోంది.
కృష్ణార్జునుల మధ్య సాగే యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. ఎన్టీయార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర పోషించబోతున్నాడనీ సమాచారం. నవంబర్ ఎండింగ్ నుంచి ‘వార్ 2’ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు