ఆకాకరతో ఆరోగ్యం మీ సొంతం.!

- July 19, 2023 , by Maagulf
ఆకాకరతో ఆరోగ్యం మీ సొంతం.!

చూడ్డానికి అచ్చు కాకరకాయలాగే వున్నా, చిన్న సైజులో గుండ్రంగా వుండే ఈ కూరగాయ ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

గిరిజన కాకర, ఆకాకర అని పిలవబడే ఈ కూరగాయ కాస్త ఖర్చు ఎక్కువే అయినా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వర్షా కాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ ఆకాకరను తప్పక తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణీ స్త్రీలు ఆకాకరను తినడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పుడుతుంది. కొత్త కణాల వృద్ధికి ఆకాకర చక్కగా తోడ్పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలోనూ ఆకాకర పాత్ర అత్యంత కీలకం. 

కిడ్నీ సమస్యలున్న ఆకాకరను తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తే మంచిది. అలాగే క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా చేయడంలో ఆకాకర తోడ్పడుతుంది.

దీనిలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్, తక్కువ కాలరీలు వుండడం వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. మలబద్ధకం సమస్య తీరుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com