‘వార్ 2’ కథ అదేనా.?
- July 19, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఎన్టీయార్. ఈ క్రమంలోనే ఆయనకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అదే ‘వార్ 2’. బీభత్సమైన యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ‘వార్’ చిత్రం సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు అందుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమాగా చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘వార్ 2’లో తెలుగు స్టార్ హీరో అయిన ఎన్టీయార్‌ని కలుపుకుని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది.
భారీ బడ్జెట్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో హృతిక్, ఎన్టీయార్ స్నేహితుల్లా కనిపించబోతున్నారట. అయితే, అనుకోని కారణం, వీరిద్దరి మధ్య స్నేహాన్ని బద్ద శత్రుత్వంగా మార్చనుందట. ఆ క్రమంలోనే వీరి మధ్య జరిగే వార్ ఎలా వుండబోతోందన్న కథతో ‘వార్ 2’ రూపుదిద్దుకుంటోంది.
కృష్ణార్జునుల మధ్య సాగే యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. ఎన్టీయార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర పోషించబోతున్నాడనీ సమాచారం. నవంబర్ ఎండింగ్ నుంచి ‘వార్ 2’ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం