2030 నాటికి 525 మించనున్న ఫిన్‌టెక్ కంపెనీలు
- July 19, 2023
రియాద్: 2030 నాటికి ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో కంపెనీల సంఖ్యను 525 కంటే ఎక్కువ పెంచాలని CMA లక్ష్యంగా పెట్టుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీ (CMA) చైర్మన్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా ఎల్-కువైజ్ వెల్లడించారు. ఆర్థిక, సాంకేతికతలో ప్రభావవంతమైన ప్రపంచ కేంద్రంగా సౌదీ అరేబియా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సాంకేతిక శిబిరం ముగింపు వేడుకలో ఎల్-కువైజ్ పాల్గొని ప్రసంగించారు. యువత సామర్థ్యాలలో పెట్టుబడులు , ఆర్థిక రంగంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ రంగంలో శ్రామిక శక్తి 105% పెరిగిందని, ఈ రంగంలో స్థానికీకరణ శాతం 74%కి చేరుకుందని ఆయన తెలిపారు.
2022లో వెంచర్ క్యాపిటల్ (SV) నెట్‌వర్క్‌ల ద్వారా ఇతర ఆర్థిక కార్యకలాపాలతో పోలిస్తే ఆర్థిక సాంకేతిక రంగం అత్యధిక నిధులు సమకూర్చింది. అర్గామ్ పోర్టల్ ప్రకారం.. ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఆర్థిక సేవలు, ఉత్పత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి.. సౌదీ అరేబియా అభివృద్ధి , ఆర్థిక లక్ష్యాలకు సేవ చేయడానికి ఆర్థిక సాంకేతికత ప్రధానంగా ఉంది. ఫిన్‌టెక్ ఇనిషియేటివ్ నవంబర్ 2022లో ప్రకటించారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల సంఖ్య 2022లో 147 కంపెనీలకు చేరుకుంది. 2018తో (10 కంపెనీలు మాత్రమే) పోలిస్తే 14.7 రెట్లు వృద్ధి చెందింది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..