డ్యూటీ ఫ్రీ డ్రా. 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుడు
- July 20, 2023
దుబాయ్: తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని కాన్కోర్స్ ఎలో డ్రా జరిగింది. భారతీయుడు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ముంబైలో ఉండే భారతీయ జాతీయుడైన వినయ్ శ్రీకర్ చోడంకర్, మిలీనియం మిలియనీర్ సిరీస్ 429లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతను టిక్కెట్ నంబర్ 3588తో జూన్ 30న దుబాయ్ నుండి సౌదీ అరేబియాలోని టబుక్కి వెళ్లేటప్పుడు కొనుగోలు చేశాడు. అయితే 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుండి $1 మిలియన్‌ను గెలుచుకున్న 212వ భారతీయ జాతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు. బుధవారం నాటి డ్రాలను దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ & సీఈఓ కాల్మ్ మెక్లౌగ్లిన్, రమేష్ సిడాంబి( COO), సలాహ్ తహ్లాక్( జాయింట్ COO) పాల్గొన్నారు. 0405 టిక్కెట్ నంబర్‌తో మిలీనియం మిలియనీర్ సిరీస్ 428లో $1 మిలియన్ విజేత మణి బాలరాజ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ అధికారుల నుండి తన ఉత్సవ చెక్కును అందుకున్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







