యూఏఈ రోడ్లపై 13 శాతం పెరిగిన పెద్ద ప్రమాదాలు

- July 22, 2023 , by Maagulf
యూఏఈ రోడ్లపై 13 శాతం పెరిగిన పెద్ద ప్రమాదాలు

యూఏఈ: ఇటీవల రోడ్డు భద్రతపై ఓపెన్ డేటాను అంతర్గత మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి.  అయితే ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్యతోపాటు పెద్ద ట్రాఫిక్ ప్రమాదాల కేసులు గత సంవత్సరం స్వల్పంగా పెరిగాయని పేర్కొన్నారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు శని, ఆదివారాల్లో జరుగుతున్నాయని నివేదికలో తెలిపారు. MOI 2022 రోడ్ సేఫ్టీ స్టాటిస్టిక్స్ ప్రకారం.. గత సంవత్సరం UAE రోడ్లపై జరిగిన 343 మరణాలలో  55 శనివారం, మరో 55 ఆదివారం రోజున సంభవించాయి. మొత్తం మరణాలలో 32 శాతం వీకెండ్లో జరిగినవే కావడం గమనార్హం.  2022లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన మొత్తం 5,045 మందిలో 32 శాతం మంది శని, ఆదివారాల్లో లేదా 818 మంది, 796 మంది గాయపడ్డారు.  వారంలో మూడవ ప్రమాదకరమైన రోజు శుక్రవారం. 52 (15 శాతం) మరణాలు,  739 (15 శాతం) గాయాలు చోటుచేసుకున్నాయి.కేవలం 39 (11 శాతం) మరణాలు, 657 (13 శాతం) గాయాలతో వారంలో "అత్యల్ప ప్రమాదకరమైన" రోజుగా సోమవారం నిలిచింది. సాయంత్రం వేళల్లో రోడ్డుపై వెళ్లడం అత్యంత ప్రమాదకరమని MOI నివేదిక తెలిపింది. 37 శాతం (127) మరణాలు,  40 (2,033) శాతం గాయాలు నమోదయ్యాయి.  16 శాతం (55) మరణాలు,  16 శాతం (804) నమోదైన గాయాలతో మధ్యాహ్నం సాపేక్షంగా సురక్షితమని పేర్కొన్నారు.

 ఇదిలా ఉంటే, దుబాయ్ పోలీసుల ప్రకారం.. గత సంవత్సరం ఎమిరేట్‌లో 31,783 రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు 87 కార్లు లేదా ప్రతి గంటకు దాదాపు 4 కార్లు నిబంధనలు ఉల్లంఘించాయి. దుబాయ్‌లో ట్రాఫిక్ చట్టానికి చేసిన సవరణలు జూలై 6 నుండి అమలులోకి వచ్చాయి.  

2022లో 343 మరణాలు, 2021లో 318తో పోలిస్తే 10% తగ్గాయి.

2022లో 5,045 మంది గాయపడ్డారు. 2021లో 4,377 మందితో పోలిస్తే 15% పెరిగింది.

2022లో 3,945 పెద్ద ప్రమాదాలు, 2021లో 3,488తో పోలిస్తే 13% పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com