డైలమాలో నాగ్.! ఏదీ కలిసి రావడం లేదా.?
- July 26, 2023అగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లు తమ తమ కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. కానీ, నాగార్జున మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే వున్నారు. కొత్త దర్శకుడు బెజవాడ ప్రసన్న కుమార్‌తో నాగార్జున ఓ సినిమా చేయాల్సి వుంది.
కానీ, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదింతవరకూ. అయితే, ఈ ప్రాజెక్ట్ నాగ్ చేయి జారిపోయిందన్న ప్రచారం కూడా జోరందుకుంటోంది ఇంకో వైపు. ఇదిలా వుంటే, నాగార్జున మరే కొత్త ప్రాజెక్టు పైనా సైన్ చేయలేదింత వరకూ. మరోవైపు అక్కినేని కుటుంబం నుంచి వారసులు చైతన్య, అఖిల్ కెరీర్ కూడా డల్‌గానే నడుస్తోంది.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. ఈ లోపు బిగ్‌బాస్ ఏడో సీజన్ అలికిడి మొదలైంది. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ కోసం నాగార్జున సిద్ధమవుతున్నారు.
అయితే, బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ వద్దంటే వద్దు.. అంటూ ఇంకో వైపు నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య నాగార్జున తన కెరీర్‌ని ఎలా నిలబెట్టుకుంటారో.! కొడుకుల కెరీర్‌ని ఎలా డిజైన్ చేస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు